అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించాలి : టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్:ప్రజలకు ఉపయోగపడే అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం నగరంలోని సీ క్యాంపు సెంటర్ సమీపంలో ఒక్క రోజు అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన టి.జి భరత్ అన్న క్యాంటీన్ ప్రారంభించారు. అనంతరం ప్రజలకు భోజనం పెట్టారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం అన్నారు. అప్పట్లో పేదలతో పాటు, మధ్య తరగతి ప్రజలు కూడా అన్న క్యాంటీన్లో భోజనం చేశేవారన్నారు. అన్న క్యాంటీన్లలో క్వాలిటీ కూడా అంత గొప్పగా ఉండేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే అన్న క్యాంటీన్లను ఈ ప్రభుత్వంలో మూసివేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వానికి అన్నాక్యాంటీన్ల విలువ తెలిసేందుకే కర్నూల్లో ఒక్క రోజు అన్న క్యాంటీన్ ఏర్పాటుచేసి పేదలకు భోజనం పెడుతున్నట్లు భరత్ తెలిపారు. ప్రభుత్వం కనీసం పేరు మార్చి అయినా అన్న క్యాంటీన్లను కొనసాగించాలని ఆయన కోరారు. ఎందుకంటే వీటి వల్ల ప్రజల ఆకలి తీరుతుందన్నారు. అనంతరం కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్నక్యాంటీన్ల ద్వారా రూ.5 కే చంద్రబాబు పేదల ఆకలి తీర్చారన్నారు. చంద్రబాబుకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసిందన్నారు. కర్నూల్లో టిజి భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే అన్న క్యాంటీన్లను మళ్లీ ఏర్పాటుచేసి పేదలకు రోజూ అన్నం పెడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు గున్నా మార్క్, అబ్బాస్, శ్రీధర్, పాల్ రాజ్, వినోద్, సముద్రాల శ్రీధర్, తదితర నేతలు పాల్గొన్నారు.