NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఐడీ ద‌మ‌న‌కాండ‌ను ఖండించండి : ఆర్ఆర్ఆర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వాట్సాప్‌ గ్రూప్‌లో వచ్చిన మెసేజ్‌ను మరొక గ్రూప్‌నకు ఫార్వర్డ్‌ చేస్తే ఐపీసీ సెక్షన్‌ 153ఏ కింద కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. కులాలు, జాతుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఈ సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తారని, కానీ ఏపీసీఐడీ పోలీసులు మాత్రం మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసిన సీనియర్‌ జర్నలిస్ట్‌ అంకబాబుపై కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వివిధ ఐపీసీ సెక్షన్ల కింద ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడానికి ముందు అతనికి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 41ఏ నోటీస్‌ కచ్చితంగా ఇవ్వాలని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఏపీసీఐడీ పోలీసుల దమనకాండను ఖండించాలని కోరారు. ఏపీసీఐడీ పోలీసుల చర్యలపై న్యాయస్థానాలలో ప్రైవేటు కంప్లైంట్‌ దాఖలు చేయాలని పిలుపునిచ్చారు.

                                            

About Author