పాక్ ప్రధాని వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం
1 min readపల్లెవెలుగువెబ్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కశ్మీర్ గురించి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ గట్టిగా బదులిచ్చింది. ‘‘తమ పొరుగు దేశాలతో శాంతిసౌభ్రాతృత్వాలను కోరుకునే దేశం, సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు. ముంబై దాడుల వంటి దారుణాలకు పాల్పడిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించదు’’ అని పాక్‌పై దుమ్మెత్తిపోసింది. శుక్రవారం షరీఫ్ యూఎన్ అసెంబ్లీలో మాట్లాడుతూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. ‘‘భారత్‌తో పాక్ శాంతిని కోరుకుంటోంది. కానీ అలాంటి ఒక శాంతి కశ్మీర్ సమస్యకు ఒక న్యాయమైన పరిష్కారం దొరికినప్పుడే సాధ్యం’’ అని షరీఫ్ యూఎన్‌జీఏ 77వ సెషన్‌లో వ్యాఖ్యానించారు.