హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్: హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 104 పోస్టులను భర్తీ చేస్తారు. దీనిలో భాగంగానే 55 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ , 49 టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ లు ఉన్నాయి. విశాఖపట్నం కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థలో ఏడాది అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
అప్రెంటిస్ విభాగాలు :
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్, మెకానికల్ ఇంజినీరింగ్ మరియు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్.
ఆన్లైన్ దరఖాస్తులు: సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం అయ్యాయి.
చివరి తేదీ: సెప్టెంబర్ 26, 2022