శిల్పారవి పై భూమా అఖిలప్రియ ఆగ్రహం
1 min readపల్లెవెలుగువెబ్: నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవిపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే స్థాయి శిల్పారవికి లేదన్నారు. టీడీపీ నాయకులు, పార్టీ గురించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. జగన్మోహన్రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు, పార్టీ స్థాపించినప్పుడు ఆయన వెంట లేని వాళ్లు వెన్నుపోటు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.