PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అందరూ.. ‘కోవిడ్​’ వారియర్సే..!

1 min read

– ఇక నుంచి ప్రొఫెసర్లు, అసిస్టెంట్​ ప్రొఫెసర్లకు కోవిడ్​ విధులు వేయండి
– మెడికల్​ కాలేజి ప్రిన్సిపల్​ను ఆదేశించిన కలెక్టర్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు హాస్పిటల్​ : కర్నూలు మెడికల్​ కళాశాలలోని ప్రొఫెసర్లు, అసిస్టెంట్​ ప్రొఫెసర్లను కోవిడ్​ విధులకు నియమించాలని కలెక్టర్​ జి. వీరపాండియన్​ కాలేజి ప్రిన్సిపల్​ జిక్కిని ఆదేశించారు. సోమవారం మెడికల్ కళాశాల న్యూ లెక్చరర్ గ్యాలరీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ లెక్చరర్ హాల్ -1 లో కర్నూలు మెడికల్ కళాశాల వివిధ విభాగాలకు సంబంధించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లతో కోవిడ్ కట్టడి చర్యల పై సమీక్ష నిర్వహించారు. కోవిడ్​ విధుల్లో లేని ప్రొఫెసర్లు, అసిస్టెంట్​ ప్రొఫెసర్ల జాబితా ఇవ్వాలని, వెంటనే వారికి విధులు కేటాయించాలన్నారు. వెంటనే 24 మందిని కోవిడ్​ డ్యూటీ ఆర్డర్స్​ ప్రోసిడింగ్స్​ ఇవ్వాలన్నారు. 12 మంది రెమిడీసివిర్, ఆక్సిజన్ ఆడిటింగ్ కు ఒక టీం… మరొక టీమ్ లో 12 మంది ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్ మానిటరింగ్ కొరకు డ్యూటీ ఆర్డర్ తక్షణమే ఇవ్వాలన్నారు.
అవసరమైన వారికే…రెమిడెసివర్​..: కోవిడ్ హాస్పిటల్ లో ఎన్ని ఐసియు బెడ్స్ ఉన్నాయి…ఎంతమంది పేషెంట్లు ఉన్నారు…ఆక్సిజన్ స్టాక్ ఎంత ఉంది…. ఎంత వినియోగించారు…ఎంతమంది పేషెంట్స్ ఆక్సిజన్ ఇచ్చారు…పైప్ లైన్, లీకేజీ ఏమన్నా అవుతుందా…రెమిడీసివిర్ వ్యాక్సిన్ స్టాకు ఎంత ఉంది…. ఎంతమంది పేషెంట్ కు ఇచ్చారు…ఎన్ని డోసులు ఇచ్చారు…. ఇంకా ఏమైనా మిగిలి ఉందా…. ఎవరికి అవసరమో వాళ్లకు మాత్రమే ఇవ్వాలని అనవసరంగా దుర్వినియోగం చేస్తూ ఉంటే షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.


99వ వార్డు ఆకస్మిక పరిశీలన : అనంతరం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో కరోన బాధితులు వైద్య సేవలు పొందుతున్న 99 వ వార్డులో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి డాక్టర్లు విజిట్ చేసే రిజిస్టర్ ను పరిశీలించారు. సీనియర్ డాక్టర్లు కోవిడ్ పేషెంట్ వార్డులలో విజిట్ చేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని ఇది ఇలాగే కొనసాగితే విజిట్ చేయని సీనియర్ డాక్టర్లను సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరిండెంట్ కు జిల్లా కలెక్టర్ సూచించారు.
ల్యాబ్​ టెస్టింగ్​ వివరాలు : అనంతరం రోగ నిర్ధారణ శాస్త్ర విభాగం (మైక్రో బయాలజీ) ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి ల్యాబ్ లో టెస్టింగ్ వివరాలు అడిగి తెలుసుకొని ల్యాబ్ లకు కు వచ్చిన శాంపిల్స్ పెండింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా వెంటనే టెస్టింగ్ చేసి 24 గంటల లోపు రిజల్ట్ ను ప్రకటించాలని..టెస్టింగ్, రిజల్ట్ ఆన్లైన్ లో డేటా ఎంట్రీ పకడ్బందీగా చేపట్టాలని కర్నూల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జిక్కి కి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా)ఎస్.రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జిక్కి, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపర్ డెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్, చీఫ్ మెడికో ఆరోగ్యశ్రీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఇలియాస్ భాష, ఏపీఎంఐడిసి సదాశివ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రొఫెసర్ లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author