కర్నూలు జీజీహెచ్లో…గర్భిణీలకు అదనపు ICU సౌకర్యం…
1 min readపల్లెవెలుగు వెబ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో గర్భవతుల కోసం అత్యాధునికమైన 14 బెడ్ల ఆబ్స్టెట్రిక్ హైబ్రిడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ 30లక్షలతో అధునీకరించడం జరిగింది.. ఇందులో అధునాతన VVR టెక్నాలజీతో నిర్మించిన 14 టన్నుల సెంట్రల్ ఎయిర్ కండీషనర్ పెట్టడం జరిగింది. దీని వలన హాల్ అంతా టెంపరేచర్ మెయింటైన్ చేయడం సులభంగా జరుగుతుంది. అంతేకాక ప్రతిబెడ్ కు ఎలక్ట్రానిక్ నర్సు కాలింగ్ సిస్టమ్ ఉంది.. ఎమర్జెన్సిలో బటన్ నొక్కగానే సిగ్నల్ నర్సింగ్ స్టేషన్ లో డిస్ప్లే అవుతుంది. లైటింగ్ కోసం LED బల్బులు, ఆక్సిజన్ పానల్సు, ఫ్యాన్లు అదనంగా ఏర్పాటుచేసారు.. కాంప్లికేటెడ్ కాన్పులు, హైరిస్కు కాన్పులు వారికి ఇది అందుబాటులోకి రావడం ఎంతో సౌకర్యం గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్ధ వారు సోమవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంటుకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, ఆసుపత్రి CSRMO డా.వెంకటేశ్వరరావు, APMIDC EE శ్రీ. సదాశివారెడ్డి, మరియు నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు.