ఈ-కామర్స్ ఫెస్టివ్ జోరు.. !
1 min readపల్లెవెలుగువెబ్ : ఈ-కామర్స్ వెబ్‌సైట్లు.. ఫెస్టివ్ సేల్స్ ఆఫర్లతో మంచి జోరుమీదున్నాయి. గత సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌లో తొలి రెండు రోజుల్లోనే ఆర్డర్లలో 28 శాతం వృద్ధి నమోదైంది. ఈ-కామర్స్ వేదికల్లో ఆర్డర్ల విషయంలో చోటు చేసుకుంటున్న మార్పులపై సాస్ కంపెనీ యూనికామర్స్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఆ వివరాలు.. పర్సనల్ కేర్ విభాగం ఆర్డర్లలో 70 శాతం వృద్ధిని నమోదు చేసింది ఎలక్ర్టానిక్స్ విభాగం (మొబైల్ ఫోన్లు మినహా) 48 శాతం వృద్ధి సాధించింది. ఆడియో ఉత్పత్తులు, స్మార్ట్ వేరబుల్ ఉత్పత్తులకు ఆర్డర్లు అధికంగా ఉన్నాయి ఫ్యాషన్ విభాగం కూడా ఎప్పటి లాగానే ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.