PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భరతమాత ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట

1 min read
దాతలకు జ్ఞాపిక అందజేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

దాతలకు జ్ఞాపిక అందజేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో సోమవారం భరత మాత ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సందడి మహేశ్వర్​, కార్యదర్శి నాగోజి నేతృత్వంలో శనివారం గోపూజ, గణపతి పూజ, ఆదివారం ప్రాత:కాల పూజ, వేదపారాయణ, న్యాస పూజలు తదితర ప్రత్యక కార్యక్రమాలు జరిగాయి. సోమవారం భద్ర దేవత మూల మహామంత్ర ప్రతిష్ట హోమము, రుద్ర, మన్యుదేవత, గరుడ దేవత, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతా హోమములు, ఉ. 8:18 నుండి యంత్రప్రతిష్ఠలు, విగ్రహ ప్రతిష్ఠలు గోపురం శిఖరం ప్రతిష్ఠలు, కళాన్యాస పూజలు, బలి ప్రధానం పూర్ణాహుతి, వేద ఆశీర్వచనంతో కార్యక్రమం పూర్తయిందని ఆలయ కమిటీ కార్యదర్శి నాగోజి తెలిపారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు నీలకంఠ రెడ్డి, కృష్టన్న, ఆలయకమిటీ సహా కార్యదర్శి మురళీధర్ రెడ్డి,బిజెపి రాష్ట్ర నాయకులు సందడి సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు మాళిగి భాను ప్రకాష్ హిందూచైతన్యవేదిక నగర అధ్యక్షులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author