నగర మేయర్ బి.వై.రామయ్య, కమిషనర్ డి.కె.బాలాజీ పల్లెవెలుగు వెబ్, కర్నూలు కార్పొరేషన్ : కరోన వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడం బాధ్యతగా భావించాలని, అప్పుడే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని నగర మేయర్ బీవై రామయ్య, నగర పాలక కమిషనర్ డీకే బాలాజి, డిప్యూటీ మేయర్ రేణుక సిద్ధారెడ్డి అన్నారు. మాస్క్ ఆవశ్యకతను వివరిస్తూ.. సోమవారం సాయంత్రం బళ్లారి చౌరస్తా వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్, ఆనంద్ థియేటర్, రాజ్ విహార్, కిడ్స్ వరల్డ్ మీదుగా వడ్డేగేరి, లాల్ మసిద్, మాసుం బాషా దర్గా, పూల బజార్, చౌక్ బజార్, పెద్ద మార్కెట్, పాత బస్టాండ్, కొండారెడ్డి బురుజు వరకు సాగింది. రహదారులపై అనవసరంగా గుమ్మిగూడవద్దని,కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్క్ లేకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారికి అధికారులు జరిమానా విధించారు. ఈ అవగాహన ర్యాలీ అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, హెల్త్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ నాగరాజు, కొర్పొరేటర్ల కసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, క్రాంతి కుమార్, ఒకటి, రెండు, నాలుగవ పట్టణ సిఐ లు వెంకటరమణ, ప్రార్ధసారధి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.