వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ..3న దుర్గాష్టమి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నంద్యాల జిల్లాలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అక్టోబర్ మూడవ తేది దుర్గాష్టమి రోజున లలితా సహస్రనామ పారాయణం మరియు హరికథా కార్యక్రమం, నాలుగవ తేది మహర్నవమి సందర్భంగా మాతృమూర్తులచే లక్ష కుంకుమార్చన, ఐదవతేది విజయదశమి సందర్భంగా అన్నమాచార్య సంకీర్తనలతో పాటు విజయదశమి పర్వదిన విశిష్టతపై ధార్మిక ప్రవచనం ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ చైర్మన్ భూమా కృష్ణ మోహన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమా కృష్ణ మోహన్ మాట్లాడుతూ శ్రీవారికి తిరుమలలో జరిగే విధంగా, సమాజంలో భక్తిభావన కలిగించే విధంగా కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు శరన్నవరాత్రి ఉత్సవములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జిల్లాకు ఒక దేవస్థానాన్ని కేంద్రంగా చేసుకుని హరికథా, బుర్రకథ, అన్నమాచార్య సంకీర్తనలు, స్థానిక భజన మండలిచే రోజూ భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కటకం వెంకటేశ్వర్లు, కార్యదర్శి దొంతు కృష్ణ మూర్తి, కోశాధికారి కటకం సత్యనారాయణ, గోదా రంగనాథ రామానుజ కూటమి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా, వేముల జనార్ధన్, జయశేఖర్, బి బిల్లకంటి మురళి, పెరుమాళ్ళ బాలసుధాకర్, ఉమామహేశ్వర రెడ్డి, శివ, మారం లలితమ్మ, చిత్రాల నాగజ్యోతి, పెరుమాళ్ళ సునిత, నూకల వేదవతి, సుందర సత్సంగం పోకల శివభూషణరెడ్డి, రాం భూపాల్ రెడ్డి, సాయి వరప్రసాద్ రెడ్డి ధర్మ ప్రచారకులు చెంచు రామ్మోహన్ రావు,బన్నూరు రామకృష్ణారెడ్డి, అర్చకులు కె.వి.సుబ్రమణ్యంతో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులందరూ కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.