రెండో అదనపు సీబీఐ కోర్టు కర్నూలుకు తరలింపు !
1 min readపల్లెవెలుగువెబ్: విశాఖలోని సీబీఐ ప్రత్యేక కోర్టుల్లోని రెండు కోర్టులు ఏపీలోని ఇతర ప్రాంతాలకు తరలనున్నాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి సంబంధించి సీబీఐ కేసులన్నీ విశాఖలోని సీబీఐ కోర్టులోనే విచారణకు వస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన కేసులనూ విశాఖలోని సీబీఐ కోర్టే విచారిస్తోంది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు విశాఖలోని సీబీఐ కోర్టులను విజయవాడ, కర్నూలుకు తరలిస్తూ నిర్ణయం తీసుకుంది.