బిల్ గేట్స్ విడాకులు… ఎందుకంటే ?
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ బిలీనియర్ బిల్ గేట్స్ దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. తమ 27 ఏళ్ల వైవాహిక బంధం నుంచి వేరుపడుతున్నట్టు బిల్ గేట్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఎన్నో సమాలోచనలు, చర్చల తర్వాత తమ బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నట్టు గేట్స్ తెలిపారు. బిల్ మిలెందా ఫౌండేషన్ సభ్యలుగానే కొనసాగుతూ.. భార్యభర్తల బంధం నుంచి విడిపోతున్నట్టు ఆయన చెప్పారు. తమ 27 ఏళ్ల వైవాహిక బంధంలో ఎంతో మంది ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేందుకు కృషి చేశామని తెలిపారు. ముగ్గురు అద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని అన్నారు. తమ నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నామని బిల్ గేట్స్ తెలిపారు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత. బిల్ మిలెందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. ఎన్నో వేల కోట్ల రూపాయలు చారీటీ కోసం ఖర్చు చేశారు.