కరెంటు విమానం.. ప్రపంచంలో మొదటిది !
1 min readపల్లెవెలుగువెబ్: పర్యావరణ హిత ఇంధన వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా చైతన్యం వస్తోంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కాలుష్య రహిత విధానాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇందులో భాగంగానే విద్యుత్ ఆధారిత వాహనాలను రూపొందిస్తూ భవిష్యత్ లో స్వచ్ఛమైన వాతావరణానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కార్లు, బస్సులు, స్కూటర్లు… ఇలా విద్యుచ్ఛక్తితో రోడ్డుపై నడిచే వాహనాలే కాదు, గాల్లో దూసుకెళ్లే విమానాలు కూడా తయారవుతున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ విమానం విద్యుత్ శక్తిని వినియోగించుకుని గాల్లోకి ఎగిరింది. ఈ విమానం పేరు ‘ఆలిస్`. ఇటీవలే ఇది విజయవంతంగా తొలి గగనవిహారం చేసింది. అమెరికాలోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో టెస్ట్ ఫ్లయిట్ చేపట్టారు. గాల్లో 3,500 అడుగుల ఎత్తులో 8 నిమిషాల పాటు గగనయానం చేసింది. ఇది పూర్తిగా కరెంటుతో నడిచే విమానం.