PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కంగ‌న ట్విట్టర్ అకౌంట్ క్లోజ్..?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగ‌న ర‌నౌత్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా తొల‌గిస్తున్నట్టు ట్విట్టర్ ప్రక‌టించింది. ట్విట్టర్ వేదిక‌గా కంగ‌న ర‌నౌత్ త‌రుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కంగ‌న వ్యాఖ్యలు ట్విట్టర్ నిమ‌య నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా ఉన్న నేప‌థ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల అనంత‌రం సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మీద కంగ‌న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ‌తంలో కూడ ఇలాంటి వ్యాఖ్యలు అనేక సంద‌ర్భాల్లో చేసిన నేప‌థ్యంలో ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది.

About Author