మహిళలు ఆర్థికంగా ఎదగాలి : నాగినిరవి సింగారెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్: నంద్యాల పట్టణంలోని టేక్కే మార్కెట్ యార్డ్ నందు శిల్ప మహిళా సహకార్ ఆధ్వర్యంలో 166 మంది మహిళలకు 21లక్షల 25 వేల రూపాయల చెక్కులను మహిళ సహకార్ బ్యాంక్ చైర్మన్ నాగినిరవి సింగారెడ్డి చేతులమీదుగా పంపిణీ చేశారు. నంద్యాల నియోజకవర్గంలో ని ఎంతోమంది మహిళలకు మహిళ సహకార్ ద్వారా వారి కష్టాలకు సమస్యలకు పరిష్కారం చూపిస్తూ వారి కుటుంబాలు ఆనందంగా ఉండడానికి శిల్పా కుటుంబం ఎంతో కృషి చేస్తుందని, ఆకుటుంబానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మహిళలు తెలియజేశారు. ఈ సందర్భంగా శిల్ప మహిళ సహకార్ చైర్మన్ నాగినిరవి సింగారెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుండి శిల్పా సేవా సమితి ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించి మహిళలకు అండగా నిలుస్తున్నామని మేము సంపాదించిన వాటిలో కొద్దిగా పేద ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మరియు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రాజకీయాలకు అతీతంగా పేద మహిళలకు వారి కాళ్లపై వారు నిలబడడానికి మా వంతు కృషి చేస్తున్నామని తీసుకున్న రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళలు సకాలంలో చెల్లించి మరి కొంతమంది మహిళలకు అవకాశం కల్పించే విధంగా సహకరించాలని మహిళలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో శిల్ప మహిళా సహకర్ డైరెక్టర్ పూర్ణిమ, మహిళా సహకార్ మేనేజర్ హరిలీల, సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ, మరియు మహిళలు పాల్గొన్నారు.