PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హృద్రోగ స‌మ‌స్యపై.. అల‌స‌త్వం చేయ‌వ‌ద్దు: ‘కిమ్స్​’వైద్యులు

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు, సెప్టెంబ‌ర్ 29: హృద్రోగ స‌మ‌స్యల‌పై అల‌స‌త్వం చేయ‌వ‌ద్దని సూచించారు కిమ్స్ హాస్పిట‌ల్స్ క‌ర్నూలు వైద్యులు. అంత‌ర్జాతీయ గుండె (వ‌ర‌ల్డ్ హార్ట్ డే) దినోత్సవాన్ని పుర‌స్కరించుకొని సమాచార మరియు  ప్రజా సంబంధాల శాఖ (ఐ&పీఆర్‌), కిమ్స్ హాస్పిట‌ల్ స‌హ‌కారంతో న‌గ‌రంలోని విలేక‌రుల‌కు ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. క‌లెక్టర్ కార్యాల‌య ప్రాంగంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి కిమ్స్ హాస్పిట‌ల్‌లోని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ చింతా రాజ్‌కుమార్‌, డాక్టర్ చెరుకు రాఘ‌వేంద్ర విలేక‌రుల‌కు వైద్య ప‌రీక్షలు చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడారు.  మారుతున్న జీవిన‌శైలిలో అనేక ఆరోగ్య స‌మ‌స్యలు అంద‌రినీ ఇబ్బంది పెడుతున్నాయి. త‌క్కువ వ‌య‌సు గ‌ల‌వారు ప్రధానంగా గుండె సంబంధిత స‌మ‌స్యల వ‌ల్ల ప్రాణాలు కొల్పోతున్నారు. నిత్యం స‌మ‌యానికి ఆహారం తీసుకోక‌పోవ‌డం, మితిమీరిన ఆల్కాహాల్‌, జంక్‌ఫుడ్స్‌, కొవ్వు ప‌దార్థాలు అధికంగా తీసుకుంటున్నారు. పైగా స‌రైన నిద్రస‌మ‌యాల‌ను కూడా పాటించ‌డం లేదు. దీని వ‌ల్ల గుండె చుట్టూ కొవ్వు పేరుక‌పోతోంది. దీని వ‌ల్ల హార్ట్ఎటాక్‌, ప్రధాన ర‌క్తనాళ స‌మ‌స్యలు వ‌స్తున్నాయి. అలాగే ఈ మ‌ధ్యకాలంలో అధికంగా జిమ్ చేయడం వ‌ల్ల కూడా ప్రాణాలు కొల్పోతున్నారు. ఇటీవ‌ల కాలంలో సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయవేత్త‌లు మ‌ర‌ణాలు కూడా మ‌నం చూశాం. మితంగా ఏదీ చేసినా… ఇబ్బందే. కాబ‌ట్టి ప్రతి ఒక్కరూ వైద్యులు ప‌ర్వవేక్షణ‌లో న‌డుచుకోవాలి. క్రమ త‌ప్పకుండా నిత్యం వ్యాయామం, వాకింగ్ చేయ‌డం ఉత్తమం. దీని వ‌ల‌న అనేక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టవ‌చ్చు. బిపి, బరువును అదుపులో ఉంచుకోవాలి. ఛాతీలో నొప్పి రావ‌డం, అధికంగా చెమ‌ట‌లు ప‌ట్టడం, కొద్దిదూరం నడిచినా.. ఆయాసం రావ‌డం వంటి       ల‌క్షణాలు క‌నిపిస్తే త‌ప్పకుండా వైద్యుల వ‌ద్దకు వెళ్లాలి.  ప్రధానంగా చెప్పుకోవాలంటే విలేక‌రుల జీవిన‌శైలి అందరికంటే విభ‌న్నంగా ఉంటుంది. వారు ఏ స‌మ‌యంలో ఎక్కడ ఉంటారో వారికే తెలియ‌దు. కాబ‌ట్టి మీ అంద‌రూ కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఆహార నియ‌మాలు త‌ప్పనిస‌రిగా పాటించాలి. ఈ కార్యక్రమంలో క‌ర్నూలు ప‌ట్టణానికి చెందిన ప్రింట్ & టీవి ఛానెల్‌ల‌కు సంబంధించిన విలేక‌రులు పాల్గొని వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్నారు.

About Author