PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుప్పెడు గుండెను కాపాడుకుందాం: డా. చింతా రాజ్​కుమార్​

1 min read

– 29న‌ అంత‌ర్జాతీయ హృద‌య దినోత్సవం

పల్లెవెలుగు వెబ్​:మ‌నిషి జీవ‌న మ‌నుగ‌డ‌లో కీల‌క‌మైన పాత్ర పోషిస్తోంది గుండె. కానీ ఇటీవ‌ల కాలంలో చూస్తున్న ప‌రిణామాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. చిన్న వ‌య‌సులోనే గుండెపోటు, ఆకస్మాతుగా గుండె ఆగిపోవ‌డం వంటి అనేక ప్ర‌మ‌దాల‌ను చూస్తున్నాం.  సైన్స్ ఎంత పెరిగినా… ఇంకా గుండె సంబంధిత వ్యాధుల‌పై ప్ర‌జ‌ల్లో స‌రైన అవ‌గాహ‌న రావ‌డం లేదు. ఇందుకోసం ప్ర‌తి సంవ‌త్సరం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 29వ తేదీన అంత‌ర్జాతీయ హృద‌య దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తారు. ఆయా దేశాల్లో వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి ప్ర‌జ‌ల్లో గుండె సంబంధిత వ్యాధుల‌పై అవ‌గాహ‌న‌ప‌రుస్తారు.

గుండె జబ్బులు రాకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి…?

వ్యాయామం చేయాలి.మనిషికి వ్యాయామం అనేది ప్రతిరోజు చేసే పనిలో భాగం కావాలి. ప్రతి రోజూ చేసే పనిలో శారీరక శ్రమను కూడా భాగం చేసుకోవాలి. సైకిల్‌ తొక్కడం, వాకింగ్‌ చేయాలి. స్థూలకాయంను తగ్గించుకోవాలి. గుండె జబ్బులు రావడానికి గల కారణాలతో స్థూలకాయం ఒకటి. బర్గర్లు, పిజ్జాలు, ఫాస్ట్‌ ఫుడ్స్‌ తినకండి. వీటిలో కొవ్వు శాతం అధికం. పండ్లు, తాజా కూరగాయలు, కార్బోహైడ్రేట్లు వుండే రైస్‌, పస్తా, బ్రెడ్‌ తినాలి.

దూమపానం మానేయాలి: ధూమపానం ఆరోగ్యానికి హానికరమైనది. ధూమపానం మానివేస్తే జీవించడానికి ఒక అడుగు ముందుకు ఎక్కువ వేయవచ్చు.

యోగ చేయాలి: యోగ రక్తపోటు తగ్గించడం, కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి , ఆందోళనలను తగ్గించడానికి సహాయపడుతుంది.

గుండెజబ్బులు రావడానికి గల కారణాలు ఏమిటి ?

గుండె రక్తనాళాల జబ్బులు ఎక్కువగా పురుషుల్లోనూ, మెనోపాజ్‌ వయసులోని స్త్రీలలోనూ వస్తాయి. పొగతాగేవారిలో ఈ జబ్బు చాలా ఎక్కువగా వస్తుంది. పొగలో ఉండే నికోటిన్‌, రక్తనాళాలను సంకోచించేటట్లు చేస్తుంది. ఇవి రక్తనాళాలలో రక్తం గడ్డకట్టేటట్లు కూడా చేస్తుంది. ఈ పొగలో ఉండే ఫ్రీరేడికల్స్‌ రక్తనాళాల లోపలి పొరను దెబ్బతినేటట్లు చేస్తాయి. ఆ ప్రదేశంలో పైబ్రస్‌ ప్లేక్స్‌ ఏర్పడే అవకాశాలు ఎక్కువ.

జీవనవిధానం: ఎక్కువ శారీరక శ్రమలేని వ్యక్తుల రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వారిలో ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.అధిక బరువు వున్నవారిలో కూడా ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. మధుమేహవ్యాధి గుండె , రక్తనాళాలను దెబ్బతినేటట్లు చేయడం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా అధికం. అధిక చక్కెర, మాంసాహారం, వెన్న, నూనెలు వంటి కొవ్వు పదార్ధాలు గుండె జబ్బులు రావడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.

లక్షణాలు: కొద్దిదూరం నడవగానే ఆయాసం, ఛాతీ ఒక్కోసారి పట్టేసినట్లుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం ఉంటేగుండె జబ్బుగా అనుమానించాల్సి ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన గుండె జబ్బు ఉందని పడిపోవడం కూడా సరికాదు. లక్షణాలు ఉన్నా నిర్ధారించుకోవడానికి పరీక్షలు తప్పనిసరి.

చికిత్స: మొదటి కొద్ది నిమిషాలు, గంటలు కీలకమైనవి. ప్రథమదశలో హృదయ ధమనులలోని అడ్డంకులు కరగడానికి మందులు ఇవ్వవచ్చు. గుండె చప్పుడు (లయ) పర్యవేక్షించబడుతుంది, ఇది అసహజంగా ఉన్నట్లయితే సత్వర చికిత్స చేయాలి. నొప్పి ఉపశమనానికి మందులు ఇవ్వాలి. రోగిని నిద్రకు ప్రోత్సహించాలి. అధిక రక్తపోటు (బిపి) ఉన్నట్లైతే రక్త పోటు తగ్గడానికి మందులు ఇవ్వాలి. నిర్దిష్టమైన చికిత్స ప్రత్యేకించబడి ఉంటుంది. రక్తనాళాలలోని అడ్డంకులపరిధి, గుండె జబ్బు పరిధి, నొప్పి తీవ్రత, రోగి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. చాలాసార్లు అతి నిర్దిష్ట పద్ధతుల ద్వారా రక్తనాళాలలో అడ్డంకులు తొలగించుట అవసరమౌతుంది. ఇది కరోనరీ ఎంజియోప్లాస్టీ, బెలూన్‌ ఉపయోగించి రక్తనాళాలను విస్తరింప జేయుట లేదా కరోనరీ బైపాస్‌ సర్జరీ రూపాలలో ఉండవచ్చును.

About Author