ఏపీ ప్రజలకు శుభవార్త
1 min read
పల్లెవెలుగువెబ్: కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని పౌర సరఫరాల శాఖ ప్రకటించింది.. దగ్గర్లో ఉన్న సచివాలయానికి వెళ్లి దరఖాస్తులు తీసుకోవాలని సూచిస్తోంది. ఇదే సమయంలో ఒంటరిగా ఉంటున్నవారికి శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో అనర్హత కారణంగా రైస్ కార్డు కోల్పోయిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అయితే దీని కోసం ఆరు దశల ధ్రువీకరణ (సిక్స్ స్టెప్ వెరిఫికేషన్) చేయనున్నారు. ఈ ఆరు స్టెప్పుల తరువాత.. వివరాలు అన్నీ సక్రమంగా ఉండి.. వారు రైస్ కార్డు తీసుకోవడానికి అర్హులు అని తెలితే.. వెంటనే కొత్తకార్డు మంజూరుకు పౌరసరఫరాల శాఖ అవకాశం ఇచ్చింది.