ఎన్నికలు జరిగితే టీడీపీకి 125 సీట్లు
1 min read
పల్లెవెలుగువెబ్: 2024 ఎన్నికలకు సంబంధించి టీడీపీ నేత, నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 125కు పైగా స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ పొత్తుల విషయంలో అంతిమ నిర్ణయం చంద్రబాబుదేనని కూడా ఆయన తేల్చి చెప్పారు.