షావోమీకి చెందిన రూ. 5,551 కోట్లు జప్తు !
1 min readపల్లెవెలుగువెబ్: చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజం షావోమీకి శుక్రవారం భారీ షాక్ తగిలింది. షావోమీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఇదివరకే కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. ఆ సంస్థకు చెందిన కార్యాలయాలపై శుక్రవారం దాడులు చేశారు. ఈ సోదాల్లో ఆ సంస్థకు చెందిన పలు కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ పత్రాలను పరిశీలించిన అధికారులు షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.5,551 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.