లోన్ యాప్ ల పై ఈడీ దాడి
1 min readపల్లెవెలుగువెబ్: చైనా నియంత్రిత లోన్ యాప్‌ల అక్రమాలపై దర్యాప్తులో భాగంగా రూ.9.82 కోట్ల నిధులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం స్తంభింపచేసింది. పలు యాప్‌లకు చెందిన ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ఖాతాల్లో వ్యాపార సంస్థలు ఉంచిన నిధులను ఫ్రీజ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయా యాప్‌లపై ఈడీ దర్యాప్తును చేపట్టిన సంగతి తెలిసిందే. చైనా నియంత్రణలోని కొమీన్ నెట్‌వర్క్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు మరికొన్ని సంస్థలు దేశంలోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని యాప్‌లను నిర్వహిస్తున్నట్లు ఈడీ పేర్కొంది.