వైయస్ ఆర్ సి పి పార్టీని విమర్శించే స్థాయి నీకు లేదు..
1 min read:వైసిపి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జానంపేట బాబు
పల్లెవెలుగు వెబ్, ఏలూరు : స్థానిక అశోక్ నగర్ దెందులూరు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో వైసిపి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జానంపేట బాబు అధ్యక్షతన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా జానంపేట బాబు మాట్లాడుతూ మొండూరు గ్రామానికి చెందిన ఆలపాటి నరసింహమూర్తి వైసీపీ పార్టీ పై అవాకులు చవాకులు పేలడం సరైన పద్ధతి కాదని,తను సీనియర్ నాయకుడునని అనుభవజ్ఞుడనని,వైసీపీ పార్టీ నాయకుడనని చెప్పుకుంటూ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల పై విమర్శలు చేస్తూ విషం కక్కుతూ మాట్లాడటం ఆయనకి సరైన పద్ధతి కాదని. ఆయన చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రస్థాయిలో ఖండించారు,ఆయన చెప్పుకుంటూ తిరిగే పదవిని గతంలోనే తొలగించారని మరి ఏ విధంగా తాను అధికార ప్రతినిధినని మాట్లాడుతున్నారో మరొక్కసారి రుజువు చేసుకోవాలని అన్నారు, పార్టీలో యాక్టివ్ రోల్ నీకు లేదని.మా నాయకులతో నీకు ఏ విధమైన సంబంధాలు లేవని అటువంటి అప్పుడు నీ పాత్ర ఏంటో తెలుసుకోవాలని సూచించారు,మా ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అదనంగా అమలుపరుస్తున్న పథకాలను గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు ముందుకు తీసుకు వెళుతున్న తీరుని అభినందిస్తూ ప్రతి ఒక్కరు అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ హర్షం వ్యక్తం చేస్తుంటే మీరు మాత్రం స్థానిక శాసనసభ్యులను,పార్టీని అవహేళన చేస్తూ మాట్లాడడం మి పెద్దరికానికి సరైన పద్ధతి కాదన్నరు,గత పాలకులు చేసిన దానికంటే ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నియోజకవర్గాన్ని రోడ్లు, డ్రైనేజీలు,త్రాగునీటికి, సాగునీరుకి ఇబ్బందులు తలెత్తకుండా మరింత మెరుగైన అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళుతున్నారన్నరు, గడచిన మూడు ఏళ్ల కాలంలో సుమారు ఐదు కోట్ల రూపాయలతో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఘనత ఒక్క ఎమ్మెల్యే అబ్బాయ చౌదరికి దక్కుతుందని అన్నారు, నియోజకవర్గంలో ఎవరికీ లేని అసంతృప్తి మీ ఒక్కరిలోనే కనిపిస్తుందని నాయకులు విమర్శించారు,ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఎమ్మెల్యే తన వంతు కృషి చేస్తుంటే మి నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని మరొక్కసారి ఈ విధంగా మాట్లాడితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు,గతంలో ఏ శాసనసభ్యుడు అసెంబ్లీ సమావేశాల్లో ఈ నియోజకవర్గ సమస్యలపై ఏ ఒక్కరు మాట్లాడిన పాపాన పోలేదని, కానీ మొన్న జరిగిన అసెంబ్లీలో ఈ నియోజకవర్గం నుంచి అన్ని సబ్జెక్టులపై వాడి వేడిగా అనర్గళంగా మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తూ ఆకట్టుకున్నాయన్నారు, రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలు ఆయనకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నరు,ఈ సమావేశంలో దెందులూరు ఏఎంసీ చైర్మన్ మేక లక్ష్మణరావు,పెదవేగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెట్టపల్లి సూరిబాబు,మాజీ సర్పంచ్ ఎం బి ఎస్ ఎస్ కృష్ణారావు, పెదవేగి మాజీ సర్పంచ్ తాత సత్యనారాయణ,భోగాపురం వైయస్సార్సీపీ నాయకులు దిమ్మెట రమేష్ తదితరులు పాల్గొన్నారు.