కోవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించిన ప్రభుత్వ విప్
1 min readపల్లెవెలుగు వెబ్, చిట్వేలు : కోవిడ్ బారిన పడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు వైద్యులకు సూచించారు. మంగళవారం రైల్వే కోడూరు అనంతరాజుపేట హార్టికల్చర్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను విప్ కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్యసేవలు, ఆహారం, పారిశుద్యపు చర్యలు, తదితర సౌకర్యాల కల్పనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ ఏప్రిల్ 30 నుంచి రైల్వేకోడూరు కోవిడ్ కేర్ సెంటర్ లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఇక్కడ వైద్యులు, సిబ్బంది పూర్తి స్థాయిలో షిప్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. మంచి పోషకాహారాన్ని అందిస్తున్నారన్నారు. ప్రత్యేక మైన సిబ్బందిచే పారిశుద్యపు చర్యలు భేషుగ్గా ఉన్నాయన్నారు. కోవిడ్ సెంటర్ కావాల్సిన మందులు, బెడ్, సిబ్బంది, సమస్యలపై వైద్య అధికారులతో మాట్లాడి త్వరగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ విప్ వెంట నోడల్ ఆఫీసర్ వీరన్న, డాక్టర్ కవిత గారు, రాజంపేట డి.ఎస్.పి భాస్కర్ రెడ్డి, ఎంపీడీవో,పార్టీ నాయకులు వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి,ఉప సర్పంచ్ సాయి, రమేష్, కిషోర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి,స్థానిక ఎంపిటిసి లు, మండలం నాయకులు పాల్గొన్నారు.