కేజ్రీవాల్ పై దాడి
1 min readపల్లెవెలుగువెబ్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై గుజరాత్లో ఓ వ్యక్తి నీళ్ల బాటిల్‌తో దాడికి యత్నించాడు. కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని వెనక నుంచి విసిరిన వాటర్ బాటిల్ ఆయనను దాటుకుని వెళ్లిపడింది. అయితే, ఈ విషయాన్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. గుజరాత్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ జెండా పాతేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ చేరుకున్నారు. నిన్న రాజ్‌కోట్‌లోని ఖోదల్‌ధామ్ ఆలయంలో నిర్వహించిన గర్భా వేడుకలకు హాజరయ్యారు.