ఇలా చేస్తే డబ్బు మీ కోసం పని చేస్తుంది
1 min readపల్లెవెలుగువెబ్: జీవితంలో ఎన్నో రకాల ఆర్థిక ప్రణాళికలు అవసరం. పన్ను ఆదా కోసం, పన్ను చెల్లింపుల ప్లానింగ్, సొంతింటి కోసం ప్లానింగ్, రిటైర్మెంట్ తర్వాతి జీవితానికి ప్లానింగ్, సమాజ సేవకు ప్లానింగ్, పిల్లల విద్యావసరాల కోసం ప్లానింగ్, పెట్టుబడులకు ప్లానింగ్, ఇన్సూరెన్స్ ప్లానింగ్, బడ్జెట్ ప్లానింగ్ ఇవన్నీ ప్రతి ఒక్కరికీ అవసరం. వీటిని నెరవేర్చుకునేందుకు ఎవరికివారు విడిగా ఒక సమగ్రమైన ప్రణాళిక రచించుకుని, దాని ప్రకారం నడుచుకోవాలి. ముఖ్యంగా సంపాదించిన దాంట్లో కనీసం 30-40 శాతం అయినా ఆదా చేయాలి. వచ్చే ఆర్జన నుంచి ఈ మొత్తాన్ని ముందుగానే పక్కన పెట్టేయాలి. 40 శాతం వరకు నీడ్స్ (అవసరాలు) కోసం ఖర్చు చేయాలి. మిగిలిన కోర్కెలకు 20 శాతం కేటాయించుకోవాలి. పైన చెప్పుకొన్నట్టు ప్రతి లక్ష్యానికీ విడిగా ఒక ప్రణాళిక ఉండాల్సిందే. నేటి జీవన అవసరాలకు అవుతున్న వ్యయం ఆధారంగా రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా ఎంత మొత్తం కావాల్సి ఉంటుందన్న అంచనా ఆధారంగా పెట్టుబడి ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇలా ప్రతి ఒక్క లక్ష్యానికీ ప్రత్యేకమైన ప్రణాళికతో అడుగులు వేస్తే వాటిని సాధించడం సులభం అవుతుంది.