అహింస..సత్యగ్రహమే… బాపూజీ ఆయుధం..
1 min read–.కరస్పాండెంట్ మాదిరాజు రామేశ్వరరావు…
పల్లెవెలుగువెబ్, గడివేముల: మహాత్ములను ఆదర్శంగా తీసుకుని వారి బాటలో అందరూ నడవాలని శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల. కరస్పాండెంట్ ఎం రామేశ్వరరావు అన్నారు.ఆదివారం మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాలలోఘనంగా నిర్వహించారు.ఇరువురు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కస్పాండెంట్ ఎం రామేశ్వరరావు మాట్లాడుతూ అహింస మార్గం వలన మన దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చిన మొదటి వ్యక్తి గాంధీజీ స్వాతంత్ర సంగ్రామంలో క్విట్ ఇండియా అంటూ ఉప్పు సత్యాగ్రహాన్ని నలుమూలలో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన మహానీయుడు అని కొనియాడారు.స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మహా నాయకుడు మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ఘనతను కూడా గుర్తు చేసుకున్నారు.ఆనాడు వారు చేసిన త్యాగాలతోనే నేడు మనం ప్రజాస్వామ్య ఫలాలు అనుభవిస్తున్నామని, ప్రజాస్వామ్య దేశంగా ప్రజలకు పాలన అందించగలుగుతున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రఘు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుని విద్యార్థులు పాల్గొన్నారు.