కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహుర్తం ఖరారు
1 min readపల్లెవెలుగువెబ్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. తాను స్థాపించబోయే జాతీయ పార్టీ పేరును దసరా రోజున ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో హైదరాబాదులో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. తాజా రాజకీయ పరిణామాలు, కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ భవన్ లో దసరా రోజున టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున జాతీయ పార్టీ పేరు ప్రకటించనున్నారు. డిసెంబరు 9న ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.