ఉపవాసం బదులు రాజ్యాంగం చదవమన్న లెక్చరర్.. ఉద్యోగం ఊస్ట్ !
1 min readపల్లెవెలుగువెబ్: వారణాసి విశ్వవిద్యాలయానికి చెందిన ఓ గెస్ట్ లెక్చరర్ దేవీ నవరాత్రుల్లో మహిళల ఉపవాసం గురించి వివదాస్పద కామెంట్లు చేసి ఉద్యోగాన్ని కోల్పోయాడు. విశ్వవిద్యాలయం పరిధిలోని మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్‌లోని అతిథి అధ్యాపకుడిగా పని చేస్తున్న ఆ వ్యక్తిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంపై వివాదం చెలరేగింది. హిందువుల పండుగ అయిన నవరాత్రుల్లో మహిళలు పాల్గొనకూడదని గెస్ట్ లెక్చరర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజనీతి శాస్త్ర విభాగంలో గెస్ట్ లెక్చరర్ అయిన డాక్టర్ మిథిలేష్ కుమార్ గౌతమ్ “మహిళలు నవరాత్రులలో తొమ్మిది రోజులు ఉపవాసం ఉండే బదులు భారత రాజ్యాంగం, హిందూ కోడ్ బిల్లును చదవడం మంచిది. వారి జీవితాలు భయం, బానిసత్వం నుంచి విముక్తి పొందుతాయి. జై భీమ్.” అని హిందీలో ట్వీట్ చేశారు.