PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘స్వచ్ఛ సర్వేక్షణ్​’తో.. గాంధీ కల నెరవేరుద్దాం..

1 min read

మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రశాంతి..

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం ద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నెరవేరుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి అన్నారు. ఆదివారం గాంధీజీ 153వ జయంతి వేడుకలలో మున్సిపల్ డీఈ నభి రసూల్  ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు .ముందుగా మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ ప్రశాంతి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌ నిర్మించాలనే బాపు కలను నెరవేర్చాలని ప్రతి ఒక్కరూ భావించి పరిశుద్ధమైన,ఆరోగ్యవంతమైన భారత్ ను ఆవిష్కరించాలన్న మహాత్ముని కలను నిజం చేసి పట్టణంలో ప్రతి ఒక్కరూ చెత్తను వీధుల్లో వేయకుండా జాగ్రత్త పడడమే కాకుండా ఇతరులు కూడా చెత్త వేయకుండా చూడాలని పేర్కొన్నారు. చీపురులు చేత పట్టి వీధులను ఊడ్చివేయడం,చెత్తాచెదారాన్ని తొలగించడం,పారిశుద్ధ్యంపైన దృష్టిని కేంద్రీకరించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం పట్టణంలోని మిడుతూరు రోడ్డు లో సీఎస్ఐ చర్చి ఎదురుగా ఉన్న ప్రధాన మురుగునీటి కాలువలను మున్సిపల్  కౌన్సిలర్లు శుభ్రం చేశారు. కార్మికుల సహాయంతో  మురుగునీటి కాలువలో చెత్తను తొలగించి కౌన్సిలర్లు ఆదర్శంగా నిలిచారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నాయబ్, లాల్ ప్రసాద్, వైఎస్ఆర్ సీపీ నాయకులు ఉస్మాన్ బేగ్, బొల్లెద్దుల రామకృష్ణ, రమేశ్, బ్రహ్మయ్య, శ్రీనివాసులు,మున్సిపల్ శానటరీ ఇన్స్ స్పెక్టర్ సునీత  ,సచివాలయం సిబ్బంది,ఏఎన్ఎమ్, మేక్మా సిబ్బంది, ఆశావర్కర్లు,మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

About Author