ఇంటర్ కాలేజీలకు సెలవులు ఎప్పటి నుంచి అంటే ?
1 min readపల్లెవెలుగువెబ్: ఇంటర్మీడియట్ కాలేజీలకు ఆదివారం నుంచి ఈనెల 9 వరకు దసరా సెలవులు ఉంటాయని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు జూనియర్ కాలేజీలకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని, ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని, అలాగే ప్రిన్సిపాళ్లపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.