నేడే రాష్ట్ర ప్రభుత్వంచే పట్టు వస్త్రాల సమర్పణ
1 min read
పల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం: దసరా మహోత్సవాలను పురస్కరించుకుని నేడు ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు మరియు దేవదాయశాఖ మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణగారు రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ఈ కార్యక్రమములో స్థానిక శాసనసభ్యులు శిల్పాచక్రపాణిరెడ్డి కూడా పాల్గొననున్నారు. రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహిస్తారు అనంతరం మేళతాళాలతో ఆలయ ప్రవేశంచేసి చేస్తారు వేదపండితులు, అర్చకస్వాముల మంత్రోచ్ఛరణలతో వస్త్ర సమర్పణను చేస్తారు.ఎంతో చారిత్రక కలిగిన శ్రీశైలం మహా క్షేత్రం ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుటుంబీకులు మొదలైన వారు ఆయా ఉత్సవ సందర్భాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించేవారని ప్రతీతి. ఈ సంప్రదాయాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోను మరియు దసరామహోత్సవాలలోను పట్టువస్త్రాలను అనవాయితీగా సమర్పిస్తోంది.