NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లలితాపీఠంలో…సహస్రనామ స్తోత్ర పారాయణం..

1 min read

పల్లెవెలుగు వెబ్​:  తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో లలితా పీఠం నందు పీఠాధిపతులు సుబ్రహ్మణ్యం స్వామి ఆధ్వర్యంలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.

అలరించిన హరికథ గానం: తిరుమలలో  శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు హరికథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది . కర్నూలుకు చెందిన వి.సరస్వతి బృందం చేసిన శ్రీసీతారామ కళ్యాణం హరికథా గానం భక్తులను మంత్రముగ్ధులను చేసింది హరికథా కార్యక్రమానికి సహకార వాయిద్యాలుగా హార్మోనియంపై బి. ఆంజనేయులు, తబలాపై  కె.సాయిచరణ్ సహకరించారు. వేదపండితులు మామిళ్ళపల్లి జగన్మోహన్ శర్మ ఆధ్వర్యంలో పండిత బృందం చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, లలితాపీఠం పీఠాధిపతులు శ్రీ గురు సుబ్రహ్మణ్యం స్వామి, నీటి పారుదల శాఖ ఉప కార్యనిర్వహణాధికారి చెన్నకేశవ నాయక్, కర్నూలు జిల్లా సిడిపిఒ వరలక్ష్మీ, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు రాచమడుగు రవి, బైసాని సురేశ్, డాక్టర్ రామ్మూర్తి, పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ, ఇల్లూరి నాగరాజు,  కాశి విశ్వనాథ గౌడ్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author