హిందూ స్త్రీలందరూ సంఘటితమవ్వాలి: నందిరెడ్డి పార్వతమ్మ
1 min readపల్లెవెలుగు వెబ్: నేటి సమాజంలో హిందూ స్త్రీలు ఎక్కువగా దాడులకు గురౌతున్నారునీ,ఇందుకోసం హిందూ స్త్రీలందరూ సంఘటితమవ్వాలనీ తద్వారా హిందూ స్త్రీ సమాజం శక్తి వంతమవ్వాలనీ విశ్వహిందూపరిషత్ మాతృశక్తి – దుర్గావాహిని ఆధ్వర్యంలో హారిశ్చంద్ర శరీన్ నగర్ లోని శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయం కళ్యాణమండపంలో జరిగిన ఆయుధపూజా కార్యక్రమంలో అన్నారు, యువతులంతా విశ్వహిందూ పరిషత్ లో భాగమైన దుర్గావాహిని లో చేరి అక్కడ ఆత్మరక్షణార్థం నేర్పించే,కరాటే,కర్రసాము,లాంటి విద్యలతోపాటూ హిందూ సంస్కృతీ సంప్రదాయాలనూ,హిందూ ధర్మాన్ని నేర్పుకుని సశక్త హిందూ యువతులుగా తయారవ్వడం అత్యావశ్యకమని దీనికోసం 14 సం.ల నుండి 35 సం.లోపు ఉన్నయువతులందరూ దుర్గావాహినిలో చేరాలని పిలుపునిచ్చారు.జిల్లా మాతృ శక్తి కన్వీనర్ శ్రీమతి రాధిక మాట్లాడుతూ మన కుటుంబాలలో ఇంటి ఇల్లాలికి ప్రత్యేక పాత్ర అనీ,ఇంట్లో అన్ని కార్యక్రమాలనూ చేసే మాతృమూర్తి తన కుటుంబం సంస్కార వంతంగా, సంస్కృతీ, సంప్రదాయాలను పాటించేలా చూసే బాధ్యత కూడా తీసుకోవాలని దానికోసం 35 సం.ల వయస్సు పై బడిన స్త్రీలందరూ మాతృశక్తి లో చేరాలనీ,హిందూ జీవన విధానాన్ని,ధర్మాలనూ తెలుసుకోవడం ప్రతి వారం మాతృ శక్తి సత్సంఘానికి రావాలనీ పిలుపునిచ్చారు.నగర మాతృ శక్తి కన్వీనర్ శ్రీమతి భార్గవి ముందుగా శ్రీదుర్గా అష్టోత్తర కుంకుమార్చన,శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాన్ని అందరిచేత పారాయణం చేయించారు. ఈకార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి,శ్రీమతి నందిరెడ్డి అన్నపూర్ణమ్మ, రాజేశ్వరి,పరిమళ,లావణ్య,పూజిత, ప్రసన్న,హేమలత,భాగ్యమ్మ,సునీత,పుష్పలత,తదితరులు పాల్గొన్నారు.