అధిక ఫీజులు వసూలు చేస్తే.. సహించం
1 min read– బయో వ్యర్ధాలు బహిరంగ ప్రదేశాల్లో వేయొద్దు
– ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను హెచ్చరించిన నగర మేయర్ , కమిషనర్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: నగరంలోని కోవిడ్ చికిత్స అందించే ప్రైవేట్ ఆస్పత్రులు పేదల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయని, అటువంటి వాటిపై చర్యలు తీసుకోడానికి వెనకాడబోమని నగర మేయర్ బీవై రామయ్య, మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజి హెచ్చరించారు. బయో వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయొద్దని, చెత్తను తరలించేందుకు మూడు ట్రాక్టర్లను కేటాయిస్తున్నామన్నారు. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నగరంలోని కోవిడ్ ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ బి.వై.రామయ్య మాట్లాడుతూ వైద్యం కోసం వచ్చిన పేదల నుంచి ఫీజు దోపిడీ చేయకుండా… మానవతాదృక్పథంలో జాలి చూపాలన్నారు. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో నగర పాలక ప్రజారోగ్యాధికారి డా.భాస్కర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.సుమన్, శానిటరీ సూపర్ వైజర్ నాగరాజు, ప్రవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.