ఆయన పీఎం అయితేనే ఏపికి ప్రత్యేక హోదా !
1 min readపల్లెవెలుగువెబ్: రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిందని… తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదాను ఇస్తామని బీజేపీ ప్రకటించిందని… ఇంతవరకు హోదా ఇవ్వలేదని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్ మీదే పెడతారని చెప్పారు. ఈ నెల 18న కర్నూలు జిల్లా ఆలూరుకు పాదయాత్ర చేరుకుంటుందని తెలిపారు. ఏపీలో రాహుల్ యాత్ర 85 కిలోమీటర్ల మేర నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణకు వెళ్తుందని తెలిపారు. 120 మంది రాహుల్ యాత్రలో పాల్గొంటున్నారని… అందులో మూడో వంతు మహిళలు ఉన్నారని చెప్పారు.