కోవిడ్ కట్టడికి .. పటిష్ట చర్యలు
1 min read– హోం ఐసోలేషన్ కిట్లు కొరత రాకూడదు..
– పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించండి
– అధికారులకు సూచించిన ఎమ్మెల్యే ఆర్థర్
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: కోవిడ్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, అందుకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ అన్నారు. మంగళవారం పాములపాడు మండలంలోని తహసీల్దార్, ఎంపీడీఓ, వైద్యాధికారులతో కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేశారు. పలు నగరాలు, పట్టణాలలో కోవిడ్ బెడ్ల కొరత అధికంగా ఉందని, తన స్థాయిలో బెడ్ల కొరకు విన్నవిస్తున్నా ఫలితం లేకపోతోందని, ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలసత్వం వహించవద్దని సూచించారు. స్వీయ నిర్బంధం, మాస్క్ ధారణ,భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత తదితర జాగ్రత్తలు పాటించేలా ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని అధికారులకు సూచించారు. . కోవిడ్ పరీక్ష నిమిత్తం పట్టణంలోని , గ్రామాలలో విస్తృతంగా పారిశుద్యపు చర్యలును ముమ్మరం చేయాలన్నారు. హైపో తదితర క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు.
ఉచిత రేషన్ పంపిణీపై చర్చ : ఉచిత రేషన్ పంపిణీని నియోజకవర్గంలో పటిష్టంగా అమలు చేయాలని ఆయా మండలాల తహశీల్దార్ కు ఎమ్మెల్యే ఆర్థర్ సూచించారు. ఇంటింటికీ రేషన్ అందించే వాహనాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.బాధ్యతగా పనిచేసి కోవిడ్ సహాయ చర్యలు చేపడుతున్న ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి తోడ్పాటు అందించాలని ఆయన ఆదేశించారు.