నెంబర్ ప్లేట్ ఆధారంగా టోల్ వసూలు !
1 min readపల్లెవెలుగువెబ్: టోల్ ట్యాక్స్ వసూళ్లను పూర్తిగా మార్చివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. టోల్ వసూళ్ల కోసం రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ గేట్లను త్వరలోనే తొలగించాలని కూడా కేంద్రం తీర్మానించింది. కొత్త తరహా నిబంధనలతో టోల్‌ను వసూలు చేయాలని ఇదివరకే తీర్మానించిన కేంద్రం… అందుకు సంబంధించిన విధివిధానాలను కూడా దాదాపుగా ఖరారు చేసింది. టోల్ గేట్లు లేకుండానే టోల్ ట్యాక్స్ వసూళ్లతో వాహనదారులు రహదారులపై ఇకపై ఎక్కడా ఆగకుండానే వెళ్లే వెసులుబాటు కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఫాస్టాగ్‌తో టోల్ గేట్లలో ట్యాక్స్‌ను వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఫాస్టాగ్ అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద భారీ క్యూలు తగ్గిపోయాయి. ఇక కొత్తగా అందుబాటులోకి రానున్న టోల్ వసూలు విధానంలో వాహనాల నెంబర్ ప్లేట్ల ఆధారంగా ట్యాక్స్‌ను వసూలు చేస్తారు.