ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
1 min readపల్లెవెలుగువెబ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు/విభాగాల్లో గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. డివిజనల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టుకు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్(ఫైర్)/ బీఈ(ఫైర్) ఉండాలి.
వయోపరిమితి: 2022 జూలై 01 నాటికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సివిల్) ఖాళీలకు 21-30 ఏళ్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్(మెన్) ఖాళీలకు 18-30 ఏళ్లు డివిజనల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఖాళీలకు 21-28 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18-42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(స్ర్కీనింగ్), మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు(జిల్లా కేంద్రాలు): శ్రీకాకుళం, గుంటూరు, విజయనగరం, పల్నాడు, పార్వతీపురం మన్యం, బాపట్ల, అల్లూరి సీతారామ రాజు, ప్రకాశం, విశాఖపట్నం, ఎస్‌పీఎ్‌సఆర్ నెల్లూరు, అనకాపల్లి, చిత్తూరు, కాకినాడ, తిరుపతి, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, అన్నమయ్య, తూర్పుగోదావరి, వైఎ్‌సఆర్ కడప, పశ్చిమగోదావరి, శ్రీ సత్యసాయి, ఏలూరు, అనంతపురం, కృష్ణా, నంద్యాల, ఎన్టీఆర్ జిల్లా, కర్నూలు.
ప్రధాన పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం
దరఖాస్తు రుసుము: రూ.370
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: అక్టోబరు 13
ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబరు 1
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 2
ప్రిలిమినరీ పరీక్ష(ఆబ్జెక్టివ్టైప్): డిసెంబరు 18
మెయిన్స్(డిస్ర్కిప్టివ్ టైప్): 2023 మార్చి రెండో వారం
వెబ్సైట్: https://psc.ap.gov.in/