చైనా అంటే మోదీకి ఎందుకంత భయం
1 min readపల్లెవెలుగువెబ్: చైనాలో ఉయ్ ఘర్ ముస్లింలపై అత్యంత దారుణమైన స్థాయిలో అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. దాన్ని చైనాను నిలదీసే తీర్మానానికి భారత్ ఎందుకు దూరంగా ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిలదీశారు. చైనా అధ్యక్షుడు క్సి జింపింగ్ అంటే ప్రధాని మోదీకి ఎందుకంత భయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వరుసగా ట్వీట్లు చేశారు.