PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మునుగోడు ఎన్నిక‌ల బ‌రిలోకి జీవిత‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నవంబర్ 3న జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. అన్ని పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలో కూడా గెలిచి సత్తాను చాటాలని బీజేపీ యత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి జీవితను ఎన్నికల ప్రచారంలోని బీజేపీ దింపుతోంది. ప్రచారానికి ఆమె కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రచారం చేయాలని కోరుతూ జీవితకు ఈటల రాజేందర్ ఫోన్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ భార్యతో కలిసి జీవిత ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

                                          

About Author