అమలాపురంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు !
1 min readపల్లెవెలుగువెబ్: ఏపీలో బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ కు మద్దతుగా పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. తాజాగా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారు. అమలాపురం క్లాక్ టవర్ వద్ద ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. జై బీఆర్ఎస్… జై కేసీఆర్ అని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ‘బీఆర్ఎస్ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి… రేవు అమ్మాజీ రావు.. డబల్ ఎంఏ’ అంటూ ఫ్లెక్సీపై ఉంది.