ఏపీలో కర్ఫ్యూ.. వీటికి మినహాయింపు
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన కట్టడి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నేటి నుంచి అమలులోకి వచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అశోక్ సింఘాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మే 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఉదయం 6గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అన్ని వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు తెరిచేందుకు అనుమతి ఉంటుంది.
వీటికి మినహాయింపులు:
- ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ ల్యాబ్ లు, మెడికల్ షాపులు.
- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్ , ఐటీ సేవలు,.
-పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ ఔట్ లెట్ లు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు. - నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు, కోల్డ్ స్టోరేజీలు.
- ప్రైవేటు సెక్యురిటీ సర్వీసులు, వ్యవసాయ పనులు అన్నింటికి మినహాయింపులు