వాయుసేనకు కొత్త ఆయుధ వ్యవస్థ
1 min readపల్లెవెలుగువెబ్: భారత వైమానిక దళం కోసం నూతనంగా ఆయుధ వ్యవస్థ బ్రాంచ్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని భారత వాయుసేన చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి ప్రకటించారు. ఈ వెపన్ సిస్టమ్ బ్రాంచ్ కింద అత్యాధునిక ఆయుధాల వినియోగంలో వైమానిక సిబ్బంది శిక్షణ పొందుతారని తెలిపారు. దీనిద్వారా ఏటా వైమానిక శిక్షణ కోసం వెచ్చించే రూ.3,400 కోట్లు ఆదా కానుందన్నారు. ఐఏఎఫ్ 90వ వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం చండీగఢ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది డిసెంబరులో ఐఏఎ్‌ఫలోకి 3వేల మంది ‘అగ్నివీర్ వాయు’లను తీసుకొని వారికి తొలి విడత శిక్షణ ఇవ్వనున్నామన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి వైమానిక దళంలోకి మహిళా అగ్నివీర్‌లను తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.