ప్రవక్త బోధన.. మానవాళికి స్ఫూర్తి : సీఐ
1 min readసర్వ మానవాళికి ఉపనిషత్తులు మార్గదర్శకాలు కావాలి సి ఐ మురళీమోహన్
పల్లెవెలుగు వెబ్, పత్తికొండ: సర్వమానవాళికి ఉపనిషత్తులు మార్గదర్శకాలు కావాలని పత్తికొండ సిఐ మురళీమోహన్ ఆకాంక్షించారు. ఆదివారం మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా పత్తికొండ పట్టణంలో యూత్ హెల్ప్ సొసైటీ ఆధ్వర్యంలో ఉదార సేవా సహాయక కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐ మురళీమోహన్ మాట్లాడుతూ సర్వ మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని అన్నారు. మతమే మనిషి అని, మంచిని తెలియజేసేది సర్వ మత గ్రంథాలని తెలిపారు. మంచిని గ్రహించి చెడుని వదిలి వేయడమే ఉపనిషత్తుల సారాంశం అని తెలిపారు. కులమతాలకతీతంగా ప్రజలంతా కలిసిమెలసి జీవించాలని అన్నారు. మిలాడ్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించుకొని షరీఫ్ ఖురాన్ ప్రతులను పంపిణీ చేశారు. అలాగే ముస్లిం పేదలకు దుస్తులను పంచి పెట్టారు. మృతి చెందిన యజమానుల కుటుంబాలకు మూడు వేలు చొప్పున 11 మంది కి ఆర్థిక సాయం అందించారు. ఎంఈఓ మస్తాన్ వలి, యువ స్పందన సొసైటీ అధ్యక్షులు సురేంద్ర కుమార్, సురేష్ ముస్లిం మత పెద్దలు, ఎన్.బి.కె ఫ్యాన్స్ అధ్యక్షులు సింగం శ్రీనివాసులు పాల్గొని మత సామరస్యం గురించి వివరించారు. ఈ సేవా సహాయక కార్యక్రమం యూత్ హెల్ప్ సొసైటీ కార్యదర్శి మీరా హుస్సేన్ సాహెబ్ ఆర్థిక సౌజన్యంతో జరిగింది.