సినిమాలకు గుడ్ బై చెప్పిన హీరోయిన్
1 min readపల్లెవెలుగువెబ్: భోజ్ పురి చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ గా పేరొందిన సహర్ అఫ్సా సంచలన ప్రకటన చేసింది. ఇక తాను సినిమాల్లో నటించబోవడంలేదని స్పష్టం చేసింది. సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనప్పుడు మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారు. కానీ సహర్ అఫ్సా మతం కోసం సినీ రంగాన్ని వదిలేస్తున్నట్టు వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇస్లాం మతం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని, తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయం ఇదేనని సహర్ అఫ్సా పేర్కొంది.