మనోజ్ పెళ్లి పై మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు
1 min readపల్లెవెలుగువెబ్: హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలపై అతని అక్క, మంచు లక్ష్మి స్పందించింది. మనోజ్‌కు తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందంటూ పెళ్లిపై పరోక్షంగా స్పష్టత ఇచ్చింది. తన పుట్టిన రోజు సందర్భంగా లక్ష్మి ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా మనోజ్ పెళ్లి గురించి ఆడిగిన ప్రశ్నకు ఎవరి బతుకు వాళ్లకు బతకనివ్వండి అంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ రోజుల్లో నిస్వార్థమైన, నిజాయితీతో కూడిన ప్రేమను పొందడం చాలా కష్టమని చెప్పింది. ఇప్పుడు మనోజ్ అలాంటి ప్రేమను పొందుతున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపింది.