హెమొస్టాటిక్ స్ప్రేకు సీడీఎస్సీఓ ఆమోదం
1 min readపల్లెవెలుగువెబ్: ట్రానెక్సామిక్ యాసిడ్ స్ర్పేకు సీడీఎస్సీఓ నుంచి ఆమోదం లభించిందని శిల్పా మెడికేర్ వెల్లడించింది. ప్రపంచంలో ఇదే తొలి ట్రానెక్సామిక్ యాసిడ్‌తో తయారు చేసిన టాపికల్ హెమొస్టాటిక్ స్ర్పే. దీన్ని వెంట తీసుకువెళ్లడం సులభమని.. లైఫ్ సేవింగ్ టూల్‌గా ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ స్ర్పే రక్తస్రావాన్ని తగ్గిస్తుంది/నిరోధిస్తుందని తెలిపింది. వాహన ప్రమాదాల వంటివి జరిగినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ప్రీహాస్పిటల్ కేర్, ఎమర్జెన్సీ మెడికల్ సిస్టమ్స్ (ఈఎంఎస్), అబులెన్స్ సేవల్లో వాడొచ్చు. ప్రమా దం జరిగినప్పుడు వ్యక్తిని హాస్పిటల్‌కు తీసుకు వచ్చే సమయంలో దీన్ని వినియోగించడం వల్ల రీ ప్లీడింగ్‌కు తక్కువ అవకాశాలు ఉంటాయని శిల్పా మెడికేర్ వెల్లడించింది.