వాల్మీకుల ‘ఎస్టీ’ హోదా… ఏమైందీ…!
1 min readవైసీపీ..టీఆర్ఎస్.. దొందు దొందే..!
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి వాల్మీకి
వాల్మీకి జయంతి శుభాకాంక్షలు
పల్లెవెలుగు వెబ్: ఎన్నికల ముందు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని ప్రగల్బాలు పలికిన టీఆర్ఎస్, వైసీపీ ప్రభుత్వాలు..అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా పట్టించుకోకపోవడం దారుణమన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి వాల్మీకి. ఏపీ, టీఎస్‌లో60 లక్షల మందికి పైగా వాల్మీకులు ఉన్నారని, వారిని ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో వాల్మీకులను ఎస్సీ, ఎస్టీ హోదా కల్పిస్తే… తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని 12 జిల్లాలు మాత్రమే బీసీ జాబితాలో కలపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో బీసీలుగా…. ఉత్తరాంధ్రలో ఎస్టీలుగా పరిగణలోకి తీసుకుంటున్నారని, ఇంతటి అసమానతలు ఎందుకు అని ఘాటుగా ప్రశ్నించారు. ఎస్టీ జాబితాలో చేర్చకపోవడంతో రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను వాల్మీకులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వాల్మీకులకు ఇచ్చిన ఎస్టీ హోదా హామీని వెంటనే తెలంగాణలోని టీఆర్ఎస్, ఏపీలోని వైసీపీ ప్రభుత్వం నెరవేర్చాలని ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి వాల్మీకి డిమాండ్ చేశారు. అంతకు ముందు వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకులు అందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.