NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ వివేకా హ‌త్య కేసు.. నిందితుల‌కు చుక్కెదురు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: వైసీపీ నేత‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో నిందితులుగా ఉన్న వారికి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో చుక్కెద‌రైంది. ఈ కేసులో కీల‌క నిందితులుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి, గ‌జ్జ‌ల ఉమాశంక‌ర్ రెడ్డిలు దాఖ‌లు చేసిన అప్పీల్ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు సోమ‌వారం కొట్టివేసింది. వివేకా హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన డ్రైవ‌ర్ ద‌స్త‌గిరికి క్ష‌మాభిక్ష ప్ర‌సాదించడాన్ని సవాల్ చేస్తూ శివ‌శంకర్ రెడ్డి, ఉమాశంక‌ర్ రెడ్డిలు సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ జ‌రిగింది. క్ష‌మాభిక్ష రద్దు చేయాలని కోరే హ‌క్కు స‌హ నిందితులుగా ఉన్న వారికి లేద‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

                                     

About Author